Tuesday, August 23, 2011

Premikudu Urvasi Urvasi Song Lyrics

చిత్రం : ప్రేమికుడు (1995)
రచన : రాజశ్రీ, సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : షాహుల్ హమీద్, రెహమాన్, సురేష్ పీటర్

పల్లవి :
ఊర్వశీ ఊర్వశీ
డటేకిటీజీ ఊర్వశీ
వూసలాగ ఒళ్లు ఉంటే ఎందుకంటా ఫార్మసీ

గెలుపుకీ సూత్రమే టేకిటీజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ

ఓ చెలి తెలుసా తెలుసా
తెలుగు మాటలు పదివేలు
అందులో ఒకటో రెండో
పలుకు నాతో అది చాలు॥

చరణం : 1
చిత్రలహరిలో కరెంటుపోతే టేకిటీజీ పాలసీ
బాగ చదివి ఫెయిలయిపోతే టేకిటీజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే టేకిటీజీ పాలసీ
బట్టతలతో తిరుపతి వెళితే టేకిటీజీ పాలసీ

ఓ చెలి తెలుసా తెలుసా జీవనాడులు ఎన్నెన్నో
తెలుపవే చిలకా చిలకా ప్రేమనాడి ఎక్కడుందో


చరణం : 2
చూపుతో ప్రేమే పలకదులే
కళ్లతో శీలం చెడిపోదే
మాంసమే తినని పిల్లుందా
పురుషులలో రాముడు ఉన్నాడా
విప్లవం సాధించకపోతే
వనిత కు మేలే జరగదులే
రుద్రమకు విగ్రహమే ఉంది
సీతకు విగ్రహమే లేదే
పోజుకొట్టి పిల్ల కూడా పడలేదంటే
టేకిటీజీ పాలసీ
పక్కసీటులో అవ్వే ఉంటే టేకిటీజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే టేకిటీజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే టేకిటీజీ పాలసీ
॥॥
పగలు నిన్ను చూడని కన్నెలకు
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం
స్వేచ్ఛయే నీకు లేనప్పుడు
స్వర్గమే ఉన్నా ఏం లాభం
ఫిగరుల సందడి లేకుండా
క్లాసుకి వెళ్లి ఏం లాభం
ఇరవైలో చెయ్యని అల్లరులు
అరవైలో చేస్తే ఏం లాభం

No comments:

Post a Comment