చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, పి.సుశీల
పల్లవి :కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ
క రగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల
చరణం : 1రమ్మని మురళీరవమ్ములు పిలిచే
రమ్మని మురళీరవమ్ములు పిలిచే
అణువణువున బృందావని తోచే
తళతళలాడే తరగలపైన
అందీ అందని అందాలు మెరిసే
కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారువీణ
చరణం : 2నీవున్న వేరే సింగారములేల? (2)
నీ పాదధూళి సిందూరము కాదా
మమతలు దూసీ మాలలు చేసీ
గళమున నిలిపిన కల్యాణి నీవే
క రగిన కలలే నిలిచిన
విరిసెను నాలో మందారమాల
చరణం : 3నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
జలజలపారే వలపులోనే
సాగెను జీవనరాగాల నావ
॥
No comments:
Post a Comment