చిత్రం: డమరుకం
గాయకులు : శ్రీ కృష్ణ, హరిణి
గీత రచయిత: భాస్కరభట్ల
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం…
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం….
నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా…
ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా….
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటలా మారనా నీ కోసం….
ప్రాణామా ప్రాణామా నువ్వే వేకువై చేరుతానంటే తూరుపై చూడనా నీ కోసం..
చరణం:1
నువ్వంటే ఎంతిష్టం సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం
కనుపాపలోన నీదే కల యద ఏటిలోన నువ్వే అలా క్షణకాలమైన చాల్లే ఇలా అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగి పోవాలె… (నేస్తమా నేస్తమా….)
చరణం:2
అలుపోస్తే తలనిమిరే చెలిమౌతా నీకోసం
నిదరోస్తే తలవాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచు పైన నువ్వే కదా పైటంచు మీద నువ్వే కదా నడువోంపు లోన నువ్వే కదా ప్రతి చోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే .. (నేస్తమా నేస్తమా….)
చిత్రం: డమరుకం
గాయకుడు: జస్ ప్రీత్ జాజ్, సునీత
గీత రచయిత: సాహితి
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
పల్లవి:
కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి.... నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి..
వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి.. వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా
చరణం 1:
నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం
నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే...
కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే...
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా ( కన్యాకుమారి ఓ ఓ...)
చరణం 2
సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది..
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు
ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు
రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా
రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి..... నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజకుమార ఓ రాజకుమార నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు దారే..
No comments:
Post a Comment