Thursday, September 29, 2011

Vasantham Telugu Song Lyrics

చిత్రం : వసంతం (2003)
రచన : వేటూరి
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఉదిత్ నారాయణ్, సుజాత

పల్లవి :

జాంపండువే దోర జాంపండువే
పూ చెండువే మల్లె పూ చెండువే
నీ పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే
నా మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే
నా వయసుకు తలతిక్క
జాంపండునే దోర జాంపండునే
పూచెండునే మల్లె పూచెండునే

చరణం : 1

ఊగింది ఊగింది నా మనసు ఊగింది
నీకంటి రెప్పల్లో అవి ఏం చిటికెలో
అవి ఏం కిటుకులో
ఉరికింది ఉరికింది నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో అవి ఏం కులుకులో
అవి ఏం మెలికలో
ఇది పంచదార చిలకా అంచులన్నీ కొరకా
మీదికొచ్చి వాలమాకా
ఓ చందనాల చినుకా కుందనాల మొలకా
కోక డాబు కొట్టమాకా
నువ్వే నేనుగా తిరిగాం జంటగా
నిప్పే లేదుగా రగిలాం మంటగా
॥॥చెండువే॥

చరణం : 2

ఒళ్లంత తుళ్లింతై చెమటెంత పడుతున్నా
ఆ చెమట చేరని చోటు చూపించవే
అది చూపించవే
కళ్లంత కవ్వింతై ఓ వింత చెబుతున్నా
ఆ చెమట చేరని చోటు ఈ పెదవులే
కొరికే పెదవులే
నువ్వు ఆడ సోకు చూపి ఈడ కొంత దాచి
కుర్రగుండె కోయమాకా
నన్ను కౌగిలింతలడగ కచ్చికొద్దీ కొరకా
కన్నె సైగ కోరమాకా
మరుగే ఉందిగా చొరవే చేయగా
పరువేం పోదుగా ఒడిలో చేరగా ॥
నా పాలబుగ్గ ఎర్రమొగ్గలేస్తే
నీ మనసున తైతక్క
రవి చూడని రవికను చూస్తే
నీ వయసుకు తలతిక్క ॥

Wednesday, September 28, 2011

Sambaram Telugu Song Lyrics

చిత్రం : సంబరం (2003)
రచన : సిరివెన్నెల
సంగీతం, గానం : ఆర్.పి.పట్నాయక్

పల్లవి : ఎందుకే ఇలా గుండె లోపల
ఇంత మంట రేపుతావు అందని కల
అన్ని వైపులా అల్లుకోకిలా
ఆగనీక సాగనీక ఎన్నాళ్లిలా
వెంటాడుతు వేధించాలా
మంటై నను సాధించాలా
కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా
మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా


చరణం : 1
తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్త దారి
నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి
జంటగా చితిమంటగా
గతమంత వెంట ఉందిగా
ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా
నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి
ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి


చరణం : 2
ఆపకిలా ఆనాటి కల అడుగడుగు తూలిపోగా
రేపకిలా కన్నీటి అల ఏ వెలుగు చూడనీక
జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మని
నిన్నలో వదిలేయనీ ఇన్నాళ్ల ఆశని
చెంతేవున్నా సొంతం కావని నిందించేకన్నా
నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

Monday, September 26, 2011

Badri Telugu Song Lyrics

చిత్రం : బద్రి (2000)
రచన : వేటూరి
సంగీతం : రమణ గోగుల
గానం : రమణ గోగుల, సునీత

పల్లవి :

వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నికల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం

చరణం : 1

ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల తనువులు కరిగిన
తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల

చరణం : 2

నీ హృదయాల ప్రణయమనే ప్రాణoలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల

Sunday, September 25, 2011

Sarigamalu Telugu Song Lyrics

చిత్రం : సరిగమలు (1994)
రచన : వేటూరి
సంగీతం : బాంబే రవి
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

పల్లవి :

గోదావరిపై ఎద కృష్ణమ్మ నీ వాల్జడ
నిండారి తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా ఓ...
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...॥

చరణం : 1

సిగ్గల్లే పండెనులే సాయంత్రము
బుగ్గల్లో పండాలి తాంబూలము॥
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతము
నన్నల్లుకోమంది వయ్యారము
కౌగిలిలో మేలుకొనే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో
గోదావరి ఎన్నెలా నాదారిలో కాయగా

చరణం : 2

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం

కవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో తుంటరివో తుమ్మెదవో
నా బాహు బంధాలలో

Saturday, September 24, 2011

Ala Modalaindi Telugu Song Lyrics

చిత్రం : అలా.. మొదలైంది (2011)
రచన : అనంతశ్రీరామ్
సంగీతం : కె.కళ్యాణి మాలిక్
గానం : కె.కళ్యాణి మాలిక్, నిత్య మీనన్

పల్లవి :
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే
అందంతో అల్లే వల
అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే
మాటల్లో ముంచే అలా
కవ్వించే నవ్వే పువ్వై పూసిన
గుండెల్లో ముల్లై తాకదా
ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా
చేతల్లో అన్నీ అందునా॥

చరణం : 1
ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు
అవి కావా మా ఆస్తులు
ప్రేమించక ముందరే ఈ తీయని కవితలు
తరువాత అవి కసురులు
అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన
ఐ యామ్ సారీ అంటారు
చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ
సింపుల్‌గా నో అందురు॥

చరణం : 2
కన్నీటి బాణమే వేసేటి విద్యలో
ముందుంది మీరే కదా
మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్స్‌లో
డిస్టింక్షన్ మీదే కదా
కన్నీరైనా మౌనమైనా
చెప్పేది నిజమేలే ప్రతిరోజు
అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించవు

Wednesday, September 21, 2011

Chakradaari Old Telugu Song Lyrics

చిత్రం : చక్రధారి (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : ఆనంద్/ఎస్.పి.బాలు

పల్లవి :

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥

చరణం : 1
అంబుజనాభా నమ్మిన వారికి (2)
అభయమునొసగీ ఆర్తిని బాపీ
ఉభయ తారకా పథమును చూపీ (2)
ఉద్ధరించు కరుణా సింధో


చరణం : 2
నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము (2)
నిను స్మరియించే ధ్యానమే ధ్యానము
నిను కీర్తించే గానమే గానము (2)
నీకర్పించే జన్మమే జన్మము

Tuesday, September 20, 2011

Premabi Shekam Telugu Song Lyrics

చిత్రం : ప్రేమాభిషేకం (1981)
రచన : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించాననీ
నా పెదవులు చెబుతున్నాయి
నిను ప్రేమించాననీ ॥కళ్లు॥
కన్నులు చూడని పెదవులు పలకని
హృదయం చెబుతోంది
నువ్వు ప్రేమించావనీ నన్నే ప్రేమించావనీ (2)
॥కళ్లు॥

చరణం : 1
నింగినేల తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్లనీ

ప్రేమకే పెళ్లనీ... ఈ పెళ్లే ప్రేమనీ
ప్రేమ పెళ్లి జంటనీ... నూరేళ్ల పంటనీ
నూరేళ్ల పంటనీ...॥కళ్లు॥

చరణం : 2
గుండెను గుండె చేరాలి
మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమనీ

తోడంటే నేననీ చెలిమంటే నువ్వనీ
నువ్వు నేను జంటనీ... నూరేళ్ల పంటనీ
నూరేళ్ల పంటనీ...
॥కళ్లు॥

Monday, September 19, 2011

Seetha Rama Raju Telugu Song Lyrics

చిత్రం : సీతారామరాజు (1999)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : బాలు, కీరవాణి, రాధిక, శారద

పల్లవి :

ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే


చరణం : 1

అన్నయ్యా నీ అలక పైపైనేనని
తెలుసును లేవయ్యా
తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి
నాకు తెలుసయ్యా
ఎన్ని కళలో వెంటతెచ్చెనంట
చూడ ముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో రాసిపోసెనంట
సంకురాత్రి వంటి సమయం
మనసే కోరే అనుబంధాలు దరిచేరే
తరతరాల తరగని వరాలగని అని
మనింటి మమతని మరిమరి పొగిడిన
పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూలదారే


చరణం : 2

కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన
కిలకిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల
కొంటె కోలాటం
ఎంత వరమో రామచంద్రుడంటి
అన్నగారి అనురాగం
ఏమి రుణమో లక్ష్మణుణ్ని మించి
చిన్నవాని అనుబంధం
ఇపుడే చే రే పది ఉగాదులొకసారే
ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ
అనేక జన్మల చిగురులు తొడిగిన
చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాల హోరే

Sunday, September 18, 2011

Kamal Hasan Nayakudu Telugu Song Lyrics

చిత్రం : నాయకుడు (1987)
రచన : వెన్నెలకంటి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు

నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టి పావురమా
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకూ
కదిలే కాలం ఆగేను
కథగా నీతో సాగేను ॥గూడు॥

నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు (2)
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకూ
కదిలే కాలం ఆగేను
కథగా నీతో సాగేను ॥

Saturday, September 17, 2011

Bharatheeyudu Telugu Song Lyrics

చిత్రం : భారతీయుడు (1996)
రచన : భువనచంద్ర
సంగీతం :
ఎ.ఆర్.రెహమాన్
గానం : బాలు, సుజాత, బృందం

పల్లవి :

తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరిగే శోకం అంతా
నేడు...॥

చరణం : 1

వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడ నే ఆడ ను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
నేడు...॥

చరణం : 2

నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా
నేడు...॥

Thursday, September 15, 2011

Suthradarulu Telugu Songs Lyrics

చిత్రం : సూత్ర ధారులు (1989)
రచన : డా॥సి.నారాయుణరెడ్డి
సంగీతం : కె.వి.వుహదేవన్
గానం : ఎస్.పి.బాలు, శైలజ

పల్లవి :
లాలేలో లిల్లేలేలో
రామలాఓయిలాల అమ్మలాలో (2)
మ్మ్... మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట


చరణం : 1
ఓ... ఇంతలేసి కళ్లున్న ఇంతి మనసు చేమంతా
ముద్దబంతా చెప్పరాదా చిగురంతా
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు
అన్నన్నా వదిలైనా నన్నైనా నిన్నైనా

కిన్నెరల్లే కన్నె పరువం కన్నుగీటి కవ్విస్తే
ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే


చరణం : 2
ఓ... గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే
కాయౌనా పండౌనా కామదేవుని పండగౌనా
కాముడయ్య లగ్గమెట్టి కబురుపెడితే
వారమేలా వర్జమేలా వల్లమాలిన వంకలేలా

ముసురుకున్న ముద్దులన్నీ
మూడుముళ్ల గుర్తులైతే
కలవరించు పొద్దులన్నీ కాగి పోయి కౌగిలైతే
॥బురుజుల॥॥

Wednesday, September 14, 2011

Jeevana Tharangalu Old Telugu Song Lyrics

చిత్రం : జీవన తరంగాలు (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : జె.వి.రాఘవులు
గానం : ఎల్.ఆర్.ఈశ్వరి, బృందం

పల్లవి :
నందామయా గురుడ నందామయా
ఉందామయా తెలుసుకుందామయా
చరణం : 1
మెరిసే సంఘం మేడిపండు
దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు

ఆ కుళ్లు లేని చోటూ ఇక్కడే
అనుభవించు రాజా ఇప్పుడే
ఆనందసారం ఇంతేనయా (2)


చరణం : 2
పుట్టినప్పుడు బట్ట కట్టలేదు
పోయేటప్పుడు అది వెంటరాదు

నడుమ బట్టకడితే నగుబాటు
నాగరీకం ముదిరితే పొరపాటు
వేదాంతసారం ఇంతేనయా (2)

Tuesday, September 13, 2011

Anthuleni Katha Old Telugu Song Lyrics

చిత్రం : అంతులేని కథ (1976)
రచన : ఆత్రేయ
సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్
గానం : బాలు

పల్లవి :

తాళిక ట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల (2)
ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు
విధి ఎప్పుడో (2)॥ట్టు॥

చరణం : 1

వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను
కాకులు దూరని కారడవి
అందులో కాలం ఎరుగని మానొకటి
ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో
చక్కని చిలకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు
ఒక గోరింకకు ఓ చిలకమ్మకు
ఒద్దిక కుదిరెనమ్మా
బావా రావా నన్నేలుకోవా॥ట్టు॥

చరణం : 2

మేళాలు తాళాలు మంగళవాద్యాలు
మిన్నంటి మోగెనమ్మా (2)
వలపు విమానాన తలపుల వేగాన
వచ్చాయి కాన్కలమ్మా
ఊరేగు దారుల వయ్యారిభామలు
వీణలు మీటిరమ్మా
సింగారి జాణల ముంగాలి మువ్వలు
ఘల్లున మోగెనమ్మా॥ట్టు॥

చరణం : 3

గోమాత లేగతో కొండంత ప్రేమతో
దీవించ వచ్చెనమ్మా
కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు
గ్రీటింగ్స్ చెప్పిరమ్మా
నాలుగు వేదాలు వల్లించు హరిణాలు
మంత్రాలు చదివెనమ్మా (2)
పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్లు
వర్థిల్లమనెనమ్మా॥ట్టు॥

చరణం : 4

చేయి చేయిగ చిలుక గోరింక
శయ్యకు తరలిరమ్మా
చెల్లెలి కోసం త్యాగము చేసిన
చిలుకమ్మ తొలగెనమ్మా
తప్పుగ తలచిన అప్పటి
గోరింకకిప్పుడు తెలిసెనమ్మా
అది చిలుకే కాదని బావిలో కప్పని
జాలిగ తలచెనమ్మా॥ట్టు॥

Monday, September 12, 2011

Chiranjeevulu Old Telugu Song Lyrics

చిత్రం : చిరంజీవులు (1956)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : ఘంటసాల
గానం : ఘంటసాల, పి.లీల

పల్లవి :

ఎందాక? ఎందాక? ఎందాక?
అందాక అందాక అందాక ॥
ఈ ఉరుకేమిటి ఈ పరుగేమిటి (2)


చరణం : 1

చివ్వునపోయి రివ్వున వాలి
చిలకను సింగారించాలి
ఓ చిలకను సింగారించాలి
పువ్వులతోనా... ఆహా... రవ్వలతోనే హా...
మా నాన్న కోడలు బంగారుబొమ్మా (2)


చరణం : 2

అయితే గియితే అమ్మాయి ఎవరో
ఆడేపాడే అందాల బాల ॥
అయితే బువ్వో... నేతి మిఠాయి ఆ...
పక్కింటి అబ్బాయి బంగారు తండ్రి (2)


చరణం : 3

కన్నులు నిండే కలకలలే
కన్నెకు సొమ్ముగ తేవాలి
నవకాలొలికే నీ చిరునవ్వే (2)
చిలకకు సింగారం కావాలి
కావాలి కావాలి కావాలి
పరుగున రావాలి రావాలి రావాలి

Sunday, September 11, 2011

Neetho Telugu Song Lyrics

చిత్రం : నీతో (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : విద్యాసాగర్,
గానం : విజయ్ ఏసుదాస్, చిత్ర

పల్లవి :

పన్నెండింటికి పడుకుంటే
కొంటెగ కలలోకొస్తావు
అయిదారింటికి మేల్కొంటే
అప్పుడు ఎదుటే ఉంటావు॥
వినవే నా మనసే నీలోనే నిండుందే
కనుకే అది నిన్నే కనిపెడుతూ ఉంటుందే


చరణం : 1

నా గుండె నీలోనే దిండేసి పడుకుందే
నువు దాని ఆకలి దప్పిక అన్నీ తీర్చాలే
చిరుముద్దు పెడతాలే మురిపాలు పడతాలే
పసిపాపలాగా పెంచి పోషిస్తుంటాలే
ఎలా మరి తలస్నానము
అందంతోటి అభిషేకము
అద్దెగా చెల్లిస్తాలే నా ప్రాణము


చరణం : 2

నీ పేరు పలికేటి నీ ఊసు తెలిపేటి
అధరాలు చేసుంటాయి ఎంతో పుణ్యము
నీ వైపు చూసేటి నీ రూపు తడిమేటి
నా కళ్లు చేసుకుంటాయి అంతే పుణ్యము
నిన్ను నన్ను కలిపేయగా
నీలో నాలో తలదాచగా
ప్రేమకే అయ్యిందమ్మా జన్మేధన్యము

 

Saturday, September 10, 2011

Iddaru Ammayilu Old Telugu Song Lyrics

చిత్రం : ఇద్దరు అమ్మాయిలు (1970)
రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, వసంత

పల్లవి :
నా హృదయపు కోవెలలో... ఆ... ఆ...
నా బంగరు లోగిలిలో... ఆ... ఆ...
ఆనందం నిండెనులే అనురాగం పండెనులే
ఆఆఆ... హాహాహా...
నా హృదయపు కోవెలలో...

చరణం : 1
ఆహా... ఆ... మధువులు కురిసే గానముతో
మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో
నా మనసును నిలువున దోచితివే
నా హృదయపు కోవెలలో...

చరణం : 2
ఆహాహా... ఆఆహాహా... ఆహహహా... ఆ...
శాంతికి నిలయం నీ హృదయం
నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మీ సరస్వతి నీవేలే
నా బ్రతుకున కాపురముందువులే
బ్రతుకున కాపురముందువులే...
నా హృదయపు కోవెలలో...

చరణం : 3
ఆహా... ఆ... ఆఆఆ.....
ఇంటికి నీవే అన్నపూర్ణగా
ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిథులతో
మన వాకిలి కళకళలాడునులే
॥హృదయపు॥

Thursday, September 8, 2011

Bhairava Dweepam Telugu Song Lyrics

చిత్రం : భైరవద్వీపం (1994)
రచన : సిరివెన్నెల
సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, సంధ్య, బృందం

పల్లవి :
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా
జంట లేదనా... ఆహాహా
ఇంత వేదనా... ఓహోహో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్నబోతివమ్మా ॥
ఓ మురిపాల మల్లిక...
దరిజేరుకుంటినే పరువాల వల్లిక...
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో (2)
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో (2)
ప్రణయానుబంధమెంత చిత్రమో ॥

చరణం : 1
విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో తరిమింది
తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ॥

చరణం : 2
కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేల ప్రియురాల మణిమేఖల

Wednesday, September 7, 2011

Anthasthulu Telugu Song Lyrics

చిత్రం : అంతస్తులు (1965)
రచన : కొసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : భానుమతి

పల్లవి :
దులపర బుల్లోడో హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
పిలిపి కళ్లతో షికార్లు కొట్టే
మలపు రాములను పిలక బట్టుకొని
వన్ టూ త్రీ చెప్పి...॥

చరణం : 1
సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని ॥
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలే జీకి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే
రౌడీల పట్టుకొని... పట్టుకొని
తళాంగు త థిగిణ తక తోం తోం అని (2)


చరణం : 2
సాంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే... వస్తే...

ఇదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైఠాయించుకొని ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని (2)॥

చరణం : 3
రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని (2)
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాలను బట్టి... పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి (2)॥

చరణం : 4
మాయమర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్లకు పోతే... పోతే

జనం ఒత్తిడికి సతమతమౌతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు దిగు
గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా... (2)॥

చిత్రం : అంతస్తులు (1965), రచన : కొసరాజు
సంగీతం : కె.వి.మహదేవన్, గానం : భానుమతి

Tuesday, September 6, 2011

Allari Bava Old Telugu Song Lyrics

చిత్రం : అల్లరి బావ (1980)
రచన : వేటూరి
సంగీతం : రాజన్-నాగేంద్ర
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
మధువనిలో రాధికవో మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం
మధురం ఈ జవ్వనం
మనోహరం... మనోహరం...
మధువనిలో రాధికనో మదిపలికే గీతికనో
మధురం ఈ జీవనం
మధురం ఈ యవ్వనం
మనోహరం... మనోహరం...


చరణం : 1
కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలి
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలి
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడు
వెతలే మాసిన కథలో వెలిగెను నేడీ సూర్యుడు
తొలి తొలి వలపులే...
తొలకరి మెరుపులై...
విరిసే వేళలో... హేళలో... డోలలో...


చరణం : 2
బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడు
ఎదిగిన బాలిక ఎదగల గోపికకతడే దేవుడు
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధిక
మరువై పోయిన మనసున వెలసెను
నేడీ దేవత
వెలుగుల వీణలే...
పలికెను జాణలో...
అది ఏ రాగమో... భావమో... బంధమో...

Monday, September 5, 2011

Toliprema Telugu Song Lyrics

చిత్రం : తొలిప్రేమ (1998)
రచన : సిరివెన్నెల
సంగీతం : దేవా
గానం : ఎస్.పి.బాలు
 
పల్లవి :
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతట ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతిజన్మలొ కలిశాం మనమె మనమే
జన్మించలేదా నీవు నాకోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ...


చరణం : 1
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరనీ
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదా నేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా
కలకాలం మంచు పొరలో ఉండగలనా


చరణం : 2
నా ఊహల్లో కదిలే కళలే ఎదుట పడినవి
నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుట పడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమకథగా మిగిలిపోనీ

Sunday, September 4, 2011

Kumar Raja Telugu Song Lyrics

చిత్రం : కుమార్ రాజా (1978)
రచన : వేటూరి, సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

పల్లవి :
అనురాగ దేవత నీవే
నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే
నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే...

చరణం : 1
ఏనాటిదో ఈ అనుబంధం
ఎదచాలనీ మధురానందం ॥
నేనేడు జన్మలు ఎత్తితే
ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం
మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే...
చరణం : 2
నన్ను నన్నుగా ప్రేమించవే
నీ పాపగా లాలించవే ॥
నా దేవివై దీవించు
నా కోసమే జీవించు
నీ దివ్య సుందర రూపమే
నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం
మన సంగమం సంగీతం

Saturday, September 3, 2011

Kanchana Telugu Song Lyrics

చిత్రం : కాంచన (2011)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : టిప్పు, బృందం


పల్లవి :
నించో నించో నించో
నించో సొంత కాళ్ల
పైన నువ్వే నించో
వంచో వంచో వంచో
వంచో విధిరాతను చేయితోనే వంచో
ఎంతమంది వచ్చారురా ఎంతమంది పోయారురా
సత్తువే చూపిన వారే చరితై ఉన్నారురా
తెచ్చుకుంది ఏమీలేదు తెసుకెళ్ల ఏదీరాదు
కళ్లతో నువ్వుకుని జీవితం జీవించేద్దాం
వద్దురా వద్దురా వద్దురా భయమన్నమాట వద్దురా
కొట్టరా కొట్టరా కొట్టరా ఓటమిని తరిమి కొట్టరా
దూకరా దూకరా దూకరా నీ మనసుతోనే దూకరా
పాడరా పాడరా పాడరా నీ కీర్తి పాట పాడరా

చరణం : 1 కష్టనష్టాలెన్నో వస్తుంటాయి
బాధలు కమ్మేస్తాయి
గుండె ధైర్యమే తోడుంటే అవి తోకలు జాడిస్తాయి
రోజు రోజూ నువు బ్రతుకుతోని
పోరును చేయాలోయి
పోరులోన నువ్వు గెలిచినావా
పండగ అవుతుందోయి
కలపే దూరమెట్టు కలలా దారిని పట్టు
ఎక్కమంటావు ఒక్కో మెట్టు
లోకమంతా మెచ్చేటట్టు
వేగంగా వేగంగా వేగంగా కాలం కదిలెను వేగంగా
చూడంగా చూడంగా చూడంగా
నీ వయసే పెరిగేను చూడంగా
ఏకంగా ఏకంగా ఏకంగా నీ గమ్యం చేరాలి ఏకంగా
గర్వంగా గర్వంగా గర్వంగా
నీ జెండా ఎగరాలి గర్వంగా

చరణం : 2 చేయి కాలు రెండూ సక్కంగున్న
సోమరిపోతును చూడు
ఎన్ని లోపాలున్నా ఎగిరి దూకే ఈ చిన్నోడిని చూడు
కంప్యూటర్‌లాంటి బ్రెయినే ఇచ్చిన
దేవుణ్ణి తిట్టెను వీడు
కాలు లేని ఈ కళ్యాణి ఆడే క థాక ళి చూడు
నమ్మకం ఉంటే చాలు జాతకం మారేనురా
నిర్భయం నిజాయితీ జయరథ చక్రాలురా
నీదిరా నీదిరా నీదిరా ఇక భవిష్యత్తే నీదిరా
లేదురా లేదురా లేదురా ఇక సరిహద్దే లేదురా
చూడరా చూడరా చూడరా నీ సహనం నీ తోడురా
పాడరా పాడరా పాడరా నీ విజయమొక పాటరా

Friday, September 2, 2011

Badri Telugu Song Lyrics

చిత్రం : బద్రి (2000)
రచన : చంద్రబోస్, సంగీతం : రమణ గోగుల
గానం : రమణ గోగుల, సునీత

పల్లవి : బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
చరణం : 1

రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో
॥మిస్సమ్మ॥
చరణం : 2

స్పీడోమీటర్‌కందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన జర్నీ ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక ఆఫాఫే అలుపురాదెప్పుడు
॥మిస్సమ్మ॥॥

Thursday, September 1, 2011

Ragam Telugu Songs Lyrics

చిత్రం : రాగం (2006)
రచన : ముత్తుస్వామి దీక్షితార్
సంగీతం : మణిశర్మ
గానం : బాంబే జయశ్రీ

మహా గణపతిమ్ మనసా స్మరామి
మహాదేవసుతం గురుగుహ నుతం
మారకోటి ప్రకాశం శాంతం
మహాకావ్యనాటకాది ప్రియం
మూషిక వాహన మోదక ప్రియం
మహా గణపతిమ్ మనసా స్మరామి
వశిష్ఠ వామదేవాది వందిత
గణపతి బొప్పా మోరియా
॥గణపతిమ్‌॥