Sunday, September 11, 2011

Neetho Telugu Song Lyrics

చిత్రం : నీతో (2002)
రచన : చంద్రబోస్
సంగీతం : విద్యాసాగర్,
గానం : విజయ్ ఏసుదాస్, చిత్ర

పల్లవి :

పన్నెండింటికి పడుకుంటే
కొంటెగ కలలోకొస్తావు
అయిదారింటికి మేల్కొంటే
అప్పుడు ఎదుటే ఉంటావు॥
వినవే నా మనసే నీలోనే నిండుందే
కనుకే అది నిన్నే కనిపెడుతూ ఉంటుందే


చరణం : 1

నా గుండె నీలోనే దిండేసి పడుకుందే
నువు దాని ఆకలి దప్పిక అన్నీ తీర్చాలే
చిరుముద్దు పెడతాలే మురిపాలు పడతాలే
పసిపాపలాగా పెంచి పోషిస్తుంటాలే
ఎలా మరి తలస్నానము
అందంతోటి అభిషేకము
అద్దెగా చెల్లిస్తాలే నా ప్రాణము


చరణం : 2

నీ పేరు పలికేటి నీ ఊసు తెలిపేటి
అధరాలు చేసుంటాయి ఎంతో పుణ్యము
నీ వైపు చూసేటి నీ రూపు తడిమేటి
నా కళ్లు చేసుకుంటాయి అంతే పుణ్యము
నిన్ను నన్ను కలిపేయగా
నీలో నాలో తలదాచగా
ప్రేమకే అయ్యిందమ్మా జన్మేధన్యము

 

No comments:

Post a Comment