Tuesday, August 23, 2011

Chandama Songs Lyrics

సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌; 
గానం: రాజేష్‌  
రచన :  పెద్దాడ మూర్తి


సాకీ: పచ్చిపాల యవ్వనాల గువ్వలాట
పంచుకుంటే రాతిరంత జాతరంట
పల్లవి: బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మ
ఒళ్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మ
పట్టుచీరల్లొ చందమామ
ఏడు వన్నెల్లొ వెన్నెలమ్మ
కన్నె రూపాన కోనసీమ
కోటి తారల్లొ ముద్దుగుమ్మ
చరణం 1: ఎదురే నిలిచే అధర మధుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం చెలికే సొంతం వసంతం
వరమై దొరికే అసలు సిసలు అపురూపం
కలిసే వరకు కలలో జరిగే విహారం
పుష్యమాసాన మంచునీవో భోగిమంటల్లొ వేడి నీవో
పూల గంధాల గాలినీవో పాల నురగల్లొ తీపి నీవో 

||బుగ్గే బంగారమా||

చరణం 2: ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వధువై బిడియం ఒదిగే సమయం ఎపుడో
జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎపుడో
అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే
అన్ని రంగుల్లో ఆమె రూపే
అన్ని వేళల్లో ఆమె ధ్యాసే
నన్ను మొత్తంగా మాయచేసే 
||బుగ్గే బంగారమా||

No comments:

Post a Comment