Tuesday, August 30, 2011

Ramu Old Telugu Song Lyrics

చిత్రం : రాము (1968)
రచన : దాశరథి
సంగీతం : ఆర్.గోవర్ధన్
గానం : పి.సుశీల


పల్లవి :
మామిడికొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే
మాటలు రాని కోయిలమ్మ పాడునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే


చరణం : 1
నన్నే నీవు అమ్మ అన్ననాడు
మీ నాన్న మనసు గంతులు వేసి ఆడు

మంచికాలం మరలా రాదా
ముళ్లబాటే పూలతోట
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే


చరణం : 2
గూటిలోని పావురాలు మూడు
అవి గొంతు కలిపి తీయని పాట పాడు

మంచు తెరలు తొలగిపోయి
పండువెన్నెల కాయునులే
ఆనందంతో అనురాగంతో నా మది ఆడునులే

No comments:

Post a Comment