Tuesday, August 23, 2011

Chandramukhi Lyrics

సంగీతం: విద్యాసాగర్‌
గానం: టిప్పు, బిన్నీ
రచన : భువనచంద్ర

 
పల్లవి: ఆ: రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా.. తోం తోం తోం
చరణం: 1 ఆ: నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా
కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా
అ: తననన ధీం త ధీం త ధీంత తన
ఆ: వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు పొదయిది
తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా
చరణం 2: ఆ: ఏ బంధవో ఇది ఏ బంధవో
ఏ జన్మబంధాల సుమగంధవో
అ: ఏ స్వప్నవో ఇది ఏ స్వప్నవో
నయనాల నడయాడు తొలి స్వప్నవో
ఆ: విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
అ: మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసము తగదిక
ఆ: జిగిబిగి సొగసుల మొరవిని
అ,ఆ: మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా

1 comment: