Monday, October 3, 2011

Dookudu Telugu Song Lyrics

చిత్రం : దూకుడు (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : ఎస్.థమన్
గానం : రాహుల్ నంబియార్

పల్లవి :

గురువారం మార్చి ఒకటి సాయంత్రం
ఫైవ్‌ఫార్టీ తొలిసారిగ చూశానే నిన్ను
చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి
నిదరేపోనందే నా కన్ను॥

రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే
అనుకుంటే కనిపిస్తావు నువ్వే
మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా
ఏం మాయో చేశావే
ఓం శాంతి శాంతి అనిపించావే
జర జరా సున్‌తో జర జానే జానా
దిల్‌సే తుఝ్‌కో ప్యార్ కియా ఏ దీవానా
నీపై చాలా ప్రేమ ఉంది గుండెల్లోన
సోచో జరా ప్యార్ సే దిల్‌కో సమ్‌ఝానా
ఐ లవ్ యూ బోలోనా హసీనా

చరణం : 1

నువ్వాడే పెర్‌ఫ్యూమ్ గుర్తొస్తే చాలే
మనసంతా ఏదో గిలిగింతే కలిగిందే పెరిగిందే
నా చుట్టూ లోకం నీతో నిండిందే ఓ నిమిషం
నీ రూపం నన్నొదిలి పోనందే
క్లైమేట్ అంతా నాలాగే లవ్‌లో
పడిపోయిందేమో అన్నట్టుందే క్రేజీగా ఉందే
నింగినేల తలకిందై కనిపించే జాదూ
ఏదో చేసేశావే ॥శాంతి॥॥జర॥

చరణం : 2

గడియారం ముల్లై తిరిగేస్తున్నానే ఏ నిమిషం
నువ్వు ఐ లవ్ యూ అంటావో అనుకుంటూ
క్యాలెండర్ కన్నా ముందే ఉన్నానే నువు నాతో
కలిసుండే ఆరోజే ఎపుడంటూ
డైలీ రొటీన్ టోటల్‌గా నీ వల్లే ఛేంజయ్యిందే
చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ
అంతో ఇంతో డీసెంట్ కుర్రాణ్ణి
ఆవారాలా మార్చేశావే ॥శాంతి॥

జర జర ప్రేమలోకి అడుగేస్తున్నా
చెలియలా చేరిపోనా నీలోన
ఏదేమైనా నీకు నేను సొంతం కానా
నన్నే నేను నీకు కానుకిస్తున్నా
నా ప్రాణం నా సర్వం నీకోసం

No comments:

Post a Comment