Wednesday, October 26, 2011

Pelli Kanuka Old Telugu Song Lyrics

 చిత్రం : పెళ్లికానుక (1960)
రచన : చెరువు ఆంజనేయశాస్త్రి
సంగీతం : ఎ.ఎం.రాజా
గానం : పి.సుశీల

పల్లవి :

ఆడే పాడే పసివాడా
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా
చరణం : 1

చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా

నా మదిలో నీకు నెలవే కలదూ (2)
బదులే నాకూ నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు
నిజమైన చాలునురా
నిజమైన చాలునురా
చరణం : 2

చిన్నారి జయమంచు మ్రోగే పటాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు

నీ రూపమే ఇంటి దీపము బాబూ నీ రూపమే ఇంటి దీపము బాబూ
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన
మరివేరే కోరమురా
మరివేరే కోరమురా ॥పాడే॥

No comments:

Post a Comment